Mobile Popup Ad
Mobile Popup Ad

చిన్నారుల సృజనాత్మకతకు మాస్టర్ బ్లాస్టర్ ఫిదా !

కలం, వెబ్ డెస్క్‌ : రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారుల ప్రతిభను చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ముగ్ధులయ్యారు. కర్రలతో వారు తయారు చేసిన ఒక చిన్న బండిని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన దృశ్యానికి సంబంధించిన వీడియోను సచిన్ తన ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

నిజమైన సృజనాత్మకతకు ఎటువంటి ఖరీదైన సౌకర్యాలు అవసరం లేదని సచిన్ పేర్కొన్నారు. ప్రతిభ అనేది తన దారిని తానే వెతుక్కుంటుందని ఆయన కొనియాడారు. ఇలాంటి చిన్నారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్తులో వారు మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తారని ఆకాంక్షించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>