Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీ సాక్షిగా.. సనాతన ధర్మంపై ఉదయనిధి మరోసారి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సనాతన ధర్మంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష నేత ఉదయనిధి ప్రసంగించారు. సనాతన ధర్మంపై తన పాత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని.. దానిని నిర్మూలించాల్సిందేనని ఆయన (Udhayanidhi Stalin) హాట్ కామెంట్స్ చేశారు. సీఎం విజయ్ ఎదురుగా కూర్చున్న వేళ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం నిర్మూళనపై వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

అంతకుముందు తాను, సీఎం విజయ్, స్పీకర్ జేసీడీ ఒకే కాలేజీలో చదువుకున్నామని ఉదయనిధి గుర్తుకు చేశారు. ఒకే కాలేజీ అయినప్పటికీ పరిపాలనలో మాత్రం డీఎంకే సీనియర్ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాని మరోసారి స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>