Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ స్టార్ కెప్టెన్‌కు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్‌ (IPL 2026)లో నజరానాలతో పాటు జరిమానాలు కూడా అంతే కామన్. ఏ చిన్న తప్పు దొర్లినా ఐపీఎల్ బోర్డ్ సదరు ప్లేయర్‌ని, టీమ్ కెప్టెన్‌కి భారీ జరిమానా విధిస్తుంది. తాజాగా సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. ఆ ఆనందంలో ఉన్నప్పుడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు షాకింగ్ వార్త తెలిసింది. అదే అతనికి ఐపీఎల్ బోర్డు రూ.12 లక్షల భారీ జరిమానా విధించడం. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకే ఈ ఫైన్ విధించారు.

మే 11న ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక ఆసక్తికర వ్యూహాన్ని అమలు చేశారు. ఇన్నింగ్స్ మొత్తం కేవలం ఫాస్ట్ బౌలర్లనే ఉపయోగించారు. అయితే, పేసర్లు రన్-అప్ తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం, మధ్యలో జరిగిన కొన్ని జాప్యాల వల్ల నిర్ణీత సమయం కంటే ఓవర్లు ఆలస్యంగా పూర్తయ్యాయి. దీనివల్ల ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఐదుగురు ఫీల్డర్లకు బదులు కేవలం నలుగురినే బౌండరీ వద్ద ఉంచేలా మైదానంలోనే పెనాల్టీని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఐపీఎల్ (IPL 2026) ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఇది మొదటి తప్పు కావడంతో కెప్టెన్ అక్షర్ పటేల్‌కు రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఒకవేళ ఇదే తప్పు రెండోసారి జరిగితే రూ. 24 లక్షలు, మూడోసారి జరిగితే రూ.30 లక్షల జరిమానా పడుతుంది. అక్షర్ పటేల్ గత ఏడాది ఐపీఎల్ 2025లో కూడా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాగే స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కోవడం గమనార్హం.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు అక్షర్ పటేల్‌తో కలిపి మొత్తం ఆరుగురు కెప్టెన్లు ఈ స్లో ఓవర్ రేట్ ఉచ్చులో చిక్కుకున్నారు. వీరిలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు జరిమానా కట్టగా.. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అజింక్య రహానేలు ఒక్కోసారి జరిమానా ఎదుర్కొన్నారు. ఈ సీజన్ 22వ మ్యాచ్ తర్వాత ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడటం మళ్లీ ఇప్పుడే (55వ మ్యాచ్) జరగడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>