సిట్ దర్యాప్తులో వేగం: బండి భగీరథ్ కేసులో కీలక సాక్ష్యాల సేకరణ!

కలం, వెబ్ డెస్క్‌ : బండి భగీరథ్‌ (Bandi Bhagirath)పై నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు ప్రక్రియ వేగంగా కదులుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. తాజాగా సిట్ సభ్యులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా భగీరథ్‌ను విచారించనున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీపీ, సీఐల నుంచి డీసీపీ రితిరాజ్ పూర్తి వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంతో పాటు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్ అత్యంత కీలకంగా మారనున్నాయి. సిట్ విచారణతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>