కలం, వెబ్ డెస్క్: నుమాయిష్ (Numaish).. అతి పెద్ద అంతర్జాతీయ మార్కెట్. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులు లభ్యమవుతాయి. ఇందుకోసం వందల సంఖ్యలో స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటవుతాయి. ప్రతి సంవత్సరంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగే నుమాయిష్ వచ్చే ఏడాది కూడా ప్రారంభంకాబోతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగునుంది. సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:30 వరకు, సెలవు దినాలలో సాయంత్రం 4:00 నుండి రాత్రి 11:00 వరకు నుమాయిష్ ఉంటుంది.
అయితే, అవసరమైతే ఈ గంటలను సర్దుబాటు చేసే అధికారం మేనేజింగ్ కమిటీకి ఉంటుంది. ఇప్పటికే నుమాయిష్(Numaish)లోని స్థలాల కోసం క్రాకరీ, రెడీమేడ్ దుస్తులు, శాలువాలు, హస్తకళలు, పరుపులు మొదలైన వాటి స్టాళ్ల కోసం ఎగ్జిబిషన్ సొసైటీకి వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. పిల్లల నుంచి పెద్దల కోసం అనేక దుకాణాలు ఉంటాయి. హైదరాబాద్ (Hyderabad) నుమాయిష్‌కు లక్షలాది మంది సందర్శకులు వస్తారు. ఇందుకోసం నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఎగ్జిబిషన్ నేపథ్యంలో మెట్రో రైళ్లు కూడా ప్రత్యేకంగా నడిచే అవకాశాలుంటాయి.
Read Also: ఆ వార్తలు నిజం కాదు.. నటి రకుల్ ప్రీత్ సింగ్
Follow Us On: Pinterest


