Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్‌ని అరెస్ట్ చేయాలి.. సంగారెడ్డిలో బీఆర్ఎస్ ధర్నా

క‌లం, మెద‌క్ బ్యూరో :  మైనర్ బాలికను వేధించిన కారణంగా పోక్సో కేసు న‌మోదైన కేంద్ర హోంశాఖ స‌హాయ‌క మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భ‌గీర‌ధ్‌ను (Bandi Bhagirath) వెంట‌నే అరెస్టు చేయ‌ల‌ని డిమాండ్ చేస్తూ.. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. కేసు నమోదు చేసి రెండు రోజులు గడిచినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.

చట్టాలు అందరికీ సమానమని చెప్పే ప్రభుత్వం, పోలీసులు ఈ కేసులో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. బాధిత బాలిక ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పటికీ బండి భ‌గీర‌ధ్‌ను (Bandi Bhagirath) అరెస్ట్ ఎందుకు జరగలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు ప్రకటించారు.

Read Also: నర్సింగ్ ఆఫీసర్‌లకు నియామక పత్రాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>