కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీల భేటీకి సంబంధించిన అంశాలు బయటకు రావడంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఈ విషయాలను లీక్ చేశారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ (PM Modi) తో మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ బీజేపీ ఎంపీ లను పిలిచారని చెప్పారు. సమావేశంలో పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ప్రధాని మోదీ సూచించారని కిషన్ రెడ్డి తెలిపారు.
అయితే, ప్రధానమంత్రితో జరిగిన చర్చలో మాట్లాడిన విషయాలు బయటపెట్టడం మంచిది కాదన్నారు. చర్చించిన అంశాలను బయటకు చెప్పొద్దని మోడీ స్వయంగా సూచించారని, అయినా కొందరు కావాలనే భేటీ వివరాలను లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ క్రమ శిక్షణకు విరుద్ధమని, ఇలాంటి చర్యలను సహించబోమని తేల్చి చెప్పారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేసింది మెంటలోడు.. ఎవరో తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి (Kishan Reddy) హెచ్చరించారు.
Read Also: బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం వాయిదా
Follow Us On: Pinterest


