epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బీఆర్‌ఎస్‌ఎల్పీ స‌మావేశం వాయిదా

కలం, వెబ్‌డెస్క్:  భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ఎల్పీ (BRSLP Meeting)  సమావేశం వాయిదా ప‌డింది. పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 19న జ‌ర‌గాల్సిన స‌మావేశం 21వ తేదీకి వాయిదా వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 19వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, పార్టీ ఎంపీలు కూడా సమావేశంలో పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 21న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి.

BRSLP Meeting వాయిదా పడిందని  పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 19న జరగాల్సిన ఈ సమావేశాలు పార్లమెంట్ సెషన్ కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ సమావేశంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సమావేశం పార్టీకి కొత్త దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>