కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ (Modi) అభినవ గాడ్సే (Godse).. నాథూరామ్ కి వారసుడు అని విమర్శించారు. ఆనాడు గాడ్సె మహాత్మను హత్య చేస్తే.. నేడు బాపూజీ పేరు తొలగించి ఆయన ఆశయాలను, స్వాతంత్ర్యపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ మరో హత్య చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్చాలని చూడడం దేశ ద్రోహపు చర్యగా షర్మిల అభివర్ణించారు. ఈ పథకాన్ని ఆర్ఎస్ఎస్ స్కీమ్ గా మార్పు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. MGNREGA పథకానికి ఉన్నపళంగా పేరు మార్చాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. స్వాతంత్ర్య సమరయోధుల మీద, మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. ‘నరేగా పథకానికి పేరు మార్చాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తిప్పికొట్టాలి. దేశం మొత్తం మోడీ తీరును ప్రతిఘటించాలి. రాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించాలి’ అని వైఎస్ షర్మిల (YS Sharmila) ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
Read Also: SBI యోనో 2.0.. కొత్త ఫీచర్లు ఇవే
Follow Us On: Youtube


