కలం, వెబ్ డెస్క్ : గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో డిసెంబర్ 6న జరిగిన భారీ అగ్నిప్రమాదం కేసు (Goa Night Club Tragedy) లో ప్రధాన నిందితులైన లూత్రా బ్రదర్స్ (Luthra Brothers) నేడు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు. ప్రమాదం జరిగిన కేవలం కొన్ని గంటల్లోనే దేశం విడిచి థాయ్‌లాండ్‌కు పారిపోయిన సౌరభ్ లుత్రా (Sourabh Luthra) , గౌరవ్ లూత్రా (Gaurav Luthra) లను థాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే గోవా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని, ఢిల్లీ కోర్టులో హాజరు పరచనున్నారు. అనంతరం గోవాకు తరలించి, మరింత దర్యాప్తు కొనసాగించనున్నారు. ప్రమాదం జరిగిన 10 రోజుల తర్వాత థాయ్‌లాండ్‌లో అదుపులోకి తీసుకున్న లూత్రా బ్రదర్స్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియలో భాగంగా నేడు బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే క్లబ్ మేనేజర్లు, సిబ్బంది సహా ఆరుగురు అరెస్టు అయ్యారు. లూత్రా సోదరుల అరెస్టుతో దర్యాప్తు వేగవంతం కానున్నది. క్లబ్‌లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లోపం, లైసెన్స్ గడువు ముగిసి కూడా కొనసాగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. లూత్రా బ్రదర్స్ తిరిగి రావడంతో గోవా అగ్నిప్రమాదం (Goa Night Club Tragedy) కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.
Read Also: ప్రధాని మోడీ అభినవ గాడ్సే : వైఎస్ షర్మిల
Follow Us On: X(Twitter)


