epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్​ లిబర్టీ

కలం, వెబ్​ డెస్క్​ : బ్రెజిల్​లోని రియో గ్రాండే డోసుల్​ రాష్ట్రాన్ని తుఫాను (Brazil Storms) అతలాకుతలం చేసింది. గ్వాయిబా నగరంలో ఉన్న ప్రముఖ రిటైల్​ స్టోర్​ హవాన్​ ముందు ఏర్పాటు చేసిన భారీ స్టాట్యూ ఆఫ్​ లిబర్టీ ప్రతిమ (Statue Of Liberty) కూలిపోయింది. తుఫాన్​ వల్ల వీచిన బలమైన గాలుల కారణంగా 79 అడుగుల విగ్రహం నేలకొరిగింది. ఈ ఘటనకు సంబంధించి కొందరు వీడియో తీశారు. ఇవి ప్రస్తుతం సోషల్​ మీడియాలో వేగంగా వైరల్​ గా మారాయి.

అయితే, హవాన్​ స్టోర్​ (Hawan Store) చైన్​ తమ బ్రాండ్ కు గర్తుగా ప్రతి స్టోర్​ ముందు స్టాట్యూ ఆఫ్​ లిబర్టీ విగ్రహాన్ని (Statue Of Liberty) ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే రియో గ్రాండే డోసుల్​ (Rio Grande Dosulo) లో ప్రతిమను పెట్టాగా, తుఫాన్​ భీభత్సంతో అది కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా, తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: షాహీన్ అఫ్రిది బౌలింగ్ రద్దు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>