epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చలిని తట్టుకునేందుకు ఈ ఆహారం తింటే మంచిది

కలం, వెబ్​ డెస్క్​ : చలికాలంలో బయట ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. దీంతో చలిని తట్టుకోలేక కొందరు అనారోగ్యం పాలవుతుంటారు. రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు లాంటి వైరల్​ వ్యాధులు వెంటనే అంటుకుంటాయి. ఈ నేపథ్యంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ఎంతో అవసరం. కొన్ని పదార్థాలు (Winter Foods) తినడం ద్వారా బాడీని చలి నుంచి కాపాడుకోవచ్చు. అలాగే, ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.

అల్లం – ఆహారంలో అల్లం భాగం చేసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు రక్త ప్రసరణ మెరుగవుతుంది. టీ లేదా కూరల్లో దీనిని ఉపయోగించవచ్చు.

బెల్లం– బెల్లంలో ఐరన్​ సమృద్ధిగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా ఒంట్లో శక్తి పెరిగి వేడిగా ఉంచుతుంది. పాలు, టీ, లడ్డు లేదా ఇతర స్వీట్స్​ లో బెల్లంను వాడొచ్చు.

నెయ్యి– దీనిని తీసుకోవడం ద్వారా వాటిలో ఉండే కొవ్వులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు నెయ్యిని తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

నువ్వులు– నువ్వుల్లో కొవ్వులు, ఐరన్​ నిండుగా ఉంటాయి. తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులను చిక్కీ లేదా లడ్డూలా తయారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యానికి లాభదాయకం.

డ్రై ఫ్రూట్స్​ – బాదం, జీడిపప్పు, వాల్​ నట్స్​, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా అనే ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తినడం ద్వారా శరీరం ధృఢంగా కావడంతో పాటు విటమిన్స్​, పోషకాలు అధికంగా సమకూరుతాయి. ప్రతిరోజు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను ఉదయం తింటే చాలా లాభాలు ఉంటాయి.

రూట్ వెజిటెబుల్స్​ – బీట్​ రూట్​, క్యారెట్​, బంగాళదుంపలను తినడం వల్ల నెమ్మదిగా జీర్ణమై శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అలాగే చలికాలంలో వచ్చే చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ధాన్యాలు – చలికాలంలో రాగులు, జొన్నలు, ఓట్స్, కొర్రలు, వరిగెలు​ వంటి మిల్లెట్​ ధాన్యాలు తీసుకోవడం ద్వారా స్థిరమైన శక్తి, వేడిని అందిస్తాయి. జావా, ఇడ్లీ, దోశ రూపంలో రాగులు, జొన్నలను ఆహారంగా తినొచ్చు.

వేడీ సూప్స్​ – ఈ కాలంలో వేడివేడిగా ఓ సూప్​ తాగితే శరీరంలో ఉత్తేజం కలుగుతుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. కూరగాయలు లేదా చికెన్​ సూప్​ తీసుకుంటే శరీరం లోపల వేడిగా ఉంటుంది.

గుడ్లు – ప్రతి రోజూ గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్​, ఐరన్​, కాల్షియం అందుతాయి. అలాగే తక్షణ శక్తిని ఇచ్చి చలి నుంచి ఉపశమనం కలిగిస్తాయి కూడా. బాయిల్డ్ ఎగ్​ లేదా ఆమ్లెట్​ రూపంలో తీసుకోవచ్చు. ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల అధిక ప్రయోజనం కలుగుతుంది.

పసుపు – వంటింట్లో ఉండే ఈ పదార్థం రోగ నిరోధకతను పెంచడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. పసుపును కూరల్లో వాడడంతో పాటు పాలలో కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే, చలికాలంలో వేడిని కలిగించే ఇతర ఆహార పదార్థాలు (Winter Foods) తినడం మంచింది.

Read Also: రాహు, కేతు దోషాల నివారణకు సింపుల్ ట్రిక్ !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>