Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రి పదవులు వద్దన్న సీపీఐ.. కానీ ఒక కండీషన్!

కలం, వెబ్ డెస్క్: టీవీకే (TVK) పార్టీకి మద్దతు తెలిపిన మూడు పార్టీలు ఆ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి విజయ్ (Vijay) వద్ద ఒక్కో కండీషన్ పెట్టినట్లు సమాచారం. సీపీఐ (CPI), సీపీఎం పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మద్దతు ఇస్తామని.. కేబినెట్‌లో చేరబోమని, తమకు మంత్రి పదవులు వద్దని తేల్చి చెప్పాయి. ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్‌ షరతు విధించింది. అలాగే, ప్రస్తుత మద్దతు, రాబోయే రాజ్యసభ, స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగాలని కోరింది. ఇక మరో పార్టీ వీసీకే అధినేత తిరుమావళన్‌ మాత్రం.. విజయ్ గెలిచిన రెండో స్థానం తిరుచ్చి ఈస్ట్‌ తమకు కేటాయించాలని కోరారు. అక్కడి నుంచి పోటీ చేయాలని తిరుమావళన్ భావిస్తున్నారు.

గవర్నర్, బీజేపీ తీరుపై సీపీఐ విమర్శలు..

గవర్నర్ ద్వారా బీజేపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని సీపీఐ (CPI) తమిళనాడు కార్యదర్శి టీటీ.షణ్ముగం విరుచుకపడ్డారు. “అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క పార్టీకి మెజార్టీ రాలేదు. విజయ్ మా పార్టీకి లేఖ రాశారు. పదో తేదీ వరకల్లా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. వెనుక నుంచి బీజేపీ రాష్ట్ర పాలన చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో పగ్గాలు చేపట్టనీయొద్దనేదే మా లక్ష్యం. డీఎంకే ఉన్నప్పుడు అదే చేశాం. ఇప్పుడు టీవీకే మద్దతు తెలుపుతున్నది కూడా అందుకే. మరోసారి ఎన్నికలు జరగాలని మేం కోరుకోవడం లేదు” అని పేర్కొన్నారు.

Read Also: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య.. నేపాల్‌కు తెలంగాణ పోలీసులు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>