Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. బీసీ కమిషన్ ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాని నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అమరావతిలో రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారరు. డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లు, 2027 డిసెంబర్ నాటికి అదనంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని నిర్దేశించారు. అర్హులైన 2 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆదేశాలు..

కేంద్రం నుంచి ఎస్సీ హోదా వచ్చే వరకు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు అందే అన్ని సంక్షేమ పథకాలు బుడగ జంగాలకు వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. దీని వలప విజయవాడ, విశాఖలో 90 వేల మందికి లబ్ధి కలగబోతుంది. ఇక రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ముస్లింల కోసం ‘రూరల్ ఆటోనగర్’ లు మరియు వక్ఫ్ భూముల్లో ‘లైవ్లీ హుడ్ హబ్’ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీ హాస్టళ్లలో ఆధునిక వసతులు.. RO ప్లాంట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులో పెండింగ్‌లో ఉన్న 22A భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టరుకి ప్రత్యేకంగా సూచించారు.

Read Also: బిగ్ ట్విస్ట్.. విజయ్ ప్రభుత్వంలో చేరడం లేదని వామపక్షాల ప్రకటన..!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>