బిగ్ ట్విస్ట్.. విజయ్ ప్రభుత్వంలో చేరడం లేదని వామపక్షాల ప్రకటన..!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో (Tamil Nadu) గత మూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి మరికాసేపట్లో తెరపడనుంది. లెఫ్ట్, కాంగ్రెస్, వీసీకే మద్దతుతో ప్రభుత్వాన్ని (TVK Government )ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్  కాసేపట్లో గవర్నర్ ను కలవనున్నారు. ఈ సమయంలో విజయ్ కు మద్దతుపై వామపక్షాలు కీలక ప్రకటన చేశాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసమే తాము విజయ్ కు మద్దతిస్తున్నామని తెలిపాయి. అయితే తాము ప్రభుత్వంలో చేరడం లేదని.. మంత్రి పదవులు అవసరం లేదని తేల్చాయి. డీఎంకే తో కలిసి ప్రజాపోరాటం చేస్తామని స్పష్టం చేశాయి.

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కాకుండా బీజేపీ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేందుకే విజయ్ (Vijay) కు మద్దతు ఇచ్చినట్లు వామపక్షాలు వెల్లడించాయి. తమ నిర్ణయం మతతత్వ బీజేపీకి చెంపపెట్టు అని వ్యాఖ్యానించాయి. మతతత్వ పార్టీకి తమిళనాడులో స్థానం లేదని చెప్పాయి. మరోవైపు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు వీసీకే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. విజయ్ పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న వీసీకే అధినేత తిరుమావళన్‌కు ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టారట.

కాగా, విజయ్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు (TVK Government) మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ విజయ్‌కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వామపక్షాలు(4), కాంగ్రెస్‌(5), వీసీకే(2) మద్దతుతో టీవీకే బలం 118కి చేరనుంది. . ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లు సాధించింది. అయితే, అందులో విజయ్ రెండు చోట్లా గెలవడంతో సంఖ్యాబలం 107కి పడిపోయింది.

Read Also: త్రిష ఆశలు గల్లంతు.. ఇక పొలిటికల్ ఎంట్రీ లేనట్టే?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>