Mobile Popup Ad
Mobile Popup Ad

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు: కొండా సురేఖ

కలం, వరంగల్ బ్యూరో: నేటి సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు బలి చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ (Hanumkonda) లోని కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం మెగా జాబ్ మేళా (Mega Job Mela) నిర్వహించారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఇప్పటి జనరేషన్‌లో చాలా మార్పులు వచ్చాయన్నారు. మనం తప్పు చేయనంతవరకూ ఎవరికీ భయపడొద్దని సూచించారు.

యువత నిబద్దతతో పనిచేయాలని, టాలెంట్ ఆధారంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తున్నారని అన్నారు. ఉద్యోగాల్లేక చాలామందికి పెళ్లిళ్లు కావడంలేదన్నారు. వరంగల్‌లో క్రైమ్ రేటు పెరుగుతోంది. ప్రధానంగా మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. నేటి యువత ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని మంత్రి (Konda Surekha) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.

Read Also: నగరంలో ప్రధాని మోదీ పర్యటన: ఆ ప్రాంతాల్లో కీలక ఆంక్షలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>