Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ సెట్‌లో చిరంజీవి.. సందడే సందడి!

కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్–జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ మూవీ జూన్ 4న విడుదల కాబోతుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవలే పెద్ది సెట్స్‌కు వచ్చి సందడి చేసిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. రామ్ చరణ్‌పై కుస్తీ సీన్లు తీస్తుండగా.. షూట్‌ను కాసేపు పరిశీలించారు. డైరెక్టర్ సుకుమార్ కూడా సెట్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, సుకుమార్‌ను చిరంజీవి తన ఫోన్‌లో వీడియో తీసుకుంటూ కనిపించారు.

ప్రీ–బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్..

పెద్ది మూవీ విడుదల కాకముందే మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అమెరికాలో ప్రీ–బుకింగ్స్‌లో భాగంగా, అతి తక్కువ సమయంలోనే 100కె డాలర్ల బుకింగ్స్ పూర్తయినట్లు మూవీ టీం వెల్లడించింది. జూన్ 3వ తేదీనే నార్త్ అమెరికాలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం రామ్ చరణ్‌ కెరీర్లోనే భారీ హిట్ కాబోతుందని.. పెద్ది క్యారెక్టర్ చాన్నాళ్లు గుర్తుంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

Read Also: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>