అల్కరాజ్‌కు వాకోవర్.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన స్పెయిన్ స్టార్

కలం, స్పోర్ట్స్ : పారిస్ మాస్టర్స్‌లో(Paris Masters 2026) స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌కు (Carlos Alcaraz) అదృష్టం కలిసొచ్చింది. మూడో రౌండ్‌లో ఇటలీ ఆటగాడు మాటియో బెరెట్టిని బరిలోకి దిగలేకపోవడంతో అల్కరాజ్ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. చేయి నొప్పి కారణంగా బెరెట్టిని టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గత కొన్ని రోజులుగా నొప్పితో బాధపడుతున్నానని, త్వరలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

అల్కరాజ్ తన తొలి మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు అలెక్స్ మిచెల్‌సన్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. ఇప్పుడు క్వార్టర్‌ఫైనల్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఆర్థర్ ఫిల్స్ లేదా అమెరికా స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడనున్నాడు. ఈ ఏడాది అల్కరాజ్ ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఖతార్ ఓపెన్, జపాన్ ఓపెన్, వియన్నా ఓపెన్ టైటిళ్లు గెలిచాడు. ఇప్పుడు పారిస్ మాస్టర్స్‌లోనూ విజయం సాధించి ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>