చేయూత పింఛన్లపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: చేయూత పింఛను (Cheyutha Pensions) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా నీటి సరఫరా జరగాలని, ఎక్కడా నీటి సమస్య రాకూడదని స్పష్టం చేశారు. జిల్లాలోని బోరుబావుల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు చొరవ చూపాలని పేర్కొన్నారు.

అనంతరం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పీఎం శ్రీ పాఠశాలల నిర్వహణపై సమీక్షించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, వారి సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్లాలని, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, డీఆర్డీఓ విజయలక్ష్మి, ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్, సందీప్, అనిల్, డీఈఓ భోజన్న, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>