కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్-2026) (AP ECET 2026) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఫలితాలను ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థుల్లో మొత్తం 91.72 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
పాలిటెక్నిక్ , డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఈ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) చేరేందుకు దోహదపడే ఈ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది ఏప్రిల్ 23న జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. దీనిలో 29,750 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రవేశాలకు అర్హత సాధించారు.
Read Also: కులాల పేర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On: WhatsApp

