Mobile Popup Ad
Mobile Popup Ad

కౌశిక్ రెడ్డి, గంగుల ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హేయమైన దాడి చేశారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కళ్ళముందే ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటు అని విమర్శించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బీ-టీంగా మారారని.. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ చర్యలకు ఉసిగొలుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప.. కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉండి.. తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>