విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి రెండో రోజు కూడా కిక్కిరిసింది. దసరా సందర్భంగా ఊళ్లకు వెళ్లిన వారంతా తిరిగి భాగ్యనగరం బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చే హైవేలపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు ఆగిపోయి ఉన్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల దగ్గర వంతెన నిర్మాణ పనుల కారణంగానే ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మరోవైపు పంతంగి టోల్ ప్లాజాతో(Panthangi Toll Plaza) పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్దీకరించే ప్రయత్నం జరుగుతోంది.
Panthangi Toll Plaza | హైదరాబాద్‌లో కూడా ఎల్బీనగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చింతలకుంట వంతెనపై ట్రావెల్స్ బస్సులు ఆగపోయాయి. దీని వల్ల ఆఫీసులకు వెళ్లడం ఆలస్యం అవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి మెరుగైన ప్రత్యామ్నాయాలు చూడాలని కోరుతున్నారు.

