రాజస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐసీయూలో ఉన్న ఎనిమిది మంది రోగులు మరణించారు. జైపూర్‌లో(Jaipur) రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్‌సింగ్ ట్రామా సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 11 మంది చికిత్స పొందుతున్నారని, ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని ట్రామా సెంటర్ ఇన్‌ఛార్జ్ అనురాగ్ దాకడ్ తెలిపారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
Jaipur | ప్రమాదం జరిగిన వెంటనే 14 మంది పేషంట్లను వేరే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మంటలు చెలరేగడంతో ఆసుపత్రి మొత్తం పొగతో నిండిపోయిందని, దాంతో రోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది రోగులను సురక్షితంతా బయటకు తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటలు కష్టపడి మంటలను అదుపు చేశారు. కాగా మంటలు చెలరేగడానికి కారణం తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

