Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

కలం, వెబ్ డెస్క్: అనంతపురం (Anantapur) జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ జగదీశ్ మీడియాకు వెల్లడించారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న ఈ భారీ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై దాడులు నిర్వహించి, మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.19.70 లక్షల నగదు, ఒక కారు, 4 బైకులు, 3 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అంతేకాకుండా నిందితులకు సంబంధించిన 9 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.18.20 లక్షల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్వహిస్తున్న ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>