Mobile Popup Ad
Mobile Popup Ad

అపెండిక్స్ అసలు దేనికి పనికొస్తుందో తెలుసా? షాకింగ్ నిజాలు!

కలం, వెబ్ డెస్క్: శరీరంలోని దేనికి పనికారి అవయం ఏదైనా ఉంది అంటే అది అపెండిక్స్ (Appendicitis) అని చాలా మంది అనుకుంటారు. కానీ అది అబద్ధమని తేలిపోయింది. అపెండిసైటిస్ జీరో కాదు ఒక హీరో అని తాజా అధ్యయనం వెల్లడించింది. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంలో అపెండిసైటిస్ ఒక హీరోలా పనిచేస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. గతంలో వైద్య నిపుణులు అపెండిసైటిస్ ను ఒక నిరుపయోగమైన అవయవంగానే పరిగణించేవారు. దీనిపై ఇన్స్టాగ్రామ్‌లో ఓ యువతి పంచుకున్న అనుభవం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. చిన్నప్పుడే అపెండిసైటిస్ తీసేయడం వల్ల తాను పెరిగి పెద్దయ్యాక తీవ్రమైన పొట్ట సమస్యలను ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సైన్స్ చెబుతున్న కొత్త విషయాల ప్రకారం, అపెండిక్స్ అనేది మన శరీరానికి మేలు చేసే ‘మంచి బ్యాక్టీరియా’ను దాచుకునే ఒక సురక్షితమైన గిడ్డంగి లాంటిది.

సాధారణంగా కలరా లేదా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు పొట్టలోని మంచి బ్యాక్టీరియా మొత్తం బయటకు పోతుంది. అటువంటప్పుడు అపెండిసైటిస్ లో దాగి ఉన్న బ్యాక్టీరియా బయటకు వచ్చి, మన జీర్ణ ప్రక్రియను మళ్లీ గాడిలో పెడుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. మరి ఇంత ఉపయోగకరమైన అవయవానికి వాపు ఎందుకు వస్తుంది? పరిశోధకుల ప్రకారం, ఆధునిక కాలంలో మనం అతి పరిశుభ్రంగా ఉండటం వల్ల మన రోగనిరోధక వ్యవస్థకు బ్యాక్టీరియాతో పోరాడే అలవాటు తగ్గుతోంది. ఫలితంగా ఏదైనా కొత్త ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం అతిగా స్పందించి అపెండిసైటిస్ వాపునకు కారణమవుతుంది. అయితే అపెండిసైటిస్ తీసేసినా మనిషి బ్రతకగలడు కానీ, అది ఉండటం వల్ల పొట్ట ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>