Mobile Popup Ad
Mobile Popup Ad

లంచం తీసుకుంటూ దొరికిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ (ACB) ముమ్మర దాడులు నిర్వహిస్తూ.. అవినీతి అధికారులు మాత్రం తగ్గేదే.. లేదు అంటున్నారు. డబ్బులిస్తేనే పనవుతుందని, ఫైళ్లు కదులుతాయని మధ్యవర్తులతో చెప్పిస్తున్నారు. అడిగినంత సమర్పించుకుంటేనే పని జరుగుతుందని వసూళ్ల దందా సాగిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌ బోరబండలో రూ.లక్ష లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఉద్యోగినిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలత ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు ఏకంగా రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ఒప్పందం ప్రకారం, రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఆమె కార్యాలయంలో సోదాలు చేశారు. శ్రీలతను అరెస్ట్ చేసి, ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వెల్లడించారు.

Read Also: మెడి‘కిల్’ దందా.. ప్రజారోగ్యంతో చెలగాటం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>