Mobile Popup Ad
Mobile Popup Ad

టీవీకే పార్టీకి మంత్రి లోకేశ్​ శుభాకాంక్షలు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ (Vijay) భారీ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి లోకేశ్ (Lokesh) అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల అరంగ్రేటంలోనే విజయం సాధించిన టీవీకే పార్టీకి శుభాకాంక్షలు. మారుతున్న ఓటర్ల ఆకాంక్షలకు, రాజకీయ కొత్త ముఖ చిత్రాలకు ఈ ఫలితం నిదర్శనం. ప్రజా సేవలోకి అడుగుపెడుతున్న విజయ్‌కి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కట్టుబడి ఉండటంతో పాటు చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆశిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దేశ వ్యాప్తంగా అభినందనల వెల్లువ..

ఎన్నికల్లో భారీ విజయం సాధించి, అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు (TVK) దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతోంది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా విజయ్‌ని అభినందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం, తమిళనాడు ప్రజల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నారు.

Read Also: పారిశ్రామిక క్లస్టర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>