Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రికి తాటి ముంజలు అందజేసిన హుస్నాబాద్ గీత కార్మికులు

కలం, కరీంనగర్ బ్యూరో : మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కి హుస్నాబాద్ గీతా కార్మికులు తాటి ముంజలను అందజేశారు. తాటి ముంజలు తిని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ తాటి మంజుల తినాలని ఆరోగ్యానికి మంచిదని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రకృతి ప్రసాదం అయిన తాటి ముంజలు ఆరోగ్యానికి మంచిది అని మంత్రి చెప్పారు.

గీతా కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో తాటి ముంజలు ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రసాదమైన ఈ తాటి ముంజలు తిని ఆస్వాదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున తాటి ముంజలు మార్కెటింగ్ కి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. తాటి ముంజలు చెట్ల నుండి వస్తాయని, ఇతర పండ్ల మాదిరి నిషా మత్తు ఉండదని చెప్పారు. దీనిని అందరూ తిని ఆస్వాదించాలని పొన్నం (Minister Ponnam Prabhakar) కోరారు.

Read Also:  బిడ్డల ఆకలి తీర్చలేని ఓ తండ్రి నిస్సహాయత.. గుండెను పిండేసే దృశ్యం

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>