Mobile Popup Ad
Mobile Popup Ad

ఓట్ల లెక్కింపు.. ఆర్జీకర్ మృతురాలి తల్లి ముందంజ

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ఆర్జీకర్ వైద్యురాలి అత్యచార సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఆర్జీకర్ మృతురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ (Ratna Debnath) బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. బెంగాల్ లో అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న స్థానాల్లో ఒకటైన పానిహటి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కుమారుడైన టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ పై ఆమె బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పోటీ చేసిన రత్న దేభ్ నాథ్ కౌంటింగ్ లో ముందంజలో నిలిచారు.

కాగా, 2024 లో ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని పై నిందితులు లైంగికంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి రత్న దేబ్ నాథ్ న్యాయపోరాటం చేశారు. తన కుమార్తే మరణానికి టీఎంసీ ప్రభుత్వం, మమతా బెనర్జీ కారణం అని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (West Bengal Elections) రత్న దేబ్ నాథ్ కు బీజేపీ టికెట్ కేటాయించింది.

Read Also: తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్‌పై భారీగా ట్రోల్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>