రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తూ అతడు చేసిన ఎక్స్(ట్వీట్టర్) పోస్ట్‌లు తీవ్ర వివాదానికి దారితీశాయి. అసలు పాలిటిక్స్‌తో నీకెందుకు అని సూచించిన వారు కూడా ఉన్నారు. ‘‘మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డంబెల్ డోర్ వచ్చి ఈ పరిస్థితులను చక్కదిద్దాలి’’ అని పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌కు కేటీఆర్‌ను ట్యాగ్ చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. దాంతో పాటుగా ‘హైదరాబాద్ మునిగింది. హామీలన్నీ విఫలమయ్యాయి. వీటిని చక్కదిద్దడానికి ప్రజలంతా మిమ్మల్ని తిరిగి పిలుస్తున్నా’ అని అతడు పోస్ట్ పెట్టి దానికి మాజీ సీఎం కేసీఆర్‌ను ట్యాగ్ చేయడం మరింత దుమారం రేపింది.
ఈ వివాదం నేపథ్యంలో తాజాగా రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు బుద్ది వచ్చిందని, మరోసారి అలా చేయనని వివరించాడు. ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని, తన పని తాను చేసుకుంటానని అన్నాడు. ఇకపై ట్విట్టర్ యాక్టివిజానికి దూరం పాటిస్తానని, పూర్తి ఫోకస్ మూవీస్‌పైనే పెడతానని క్లారిటీ ఇచ్చాడు.

