Palasa Airport | శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న ఎయిర్‌పోర్ట్ వల్ల అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే అవన్నీ కూడా అపోహలు మాత్రమేనని, ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ వళ్ల ఒక్కరంటే ఒక్క రైతుకు కూడా నష్టం జరగదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు(Ram Mohan Naidu) భరోసా ఇచ్చారు. ఆదివారం ఎయిర్‌పోర్ట్ పరిసర గ్రామాల రైతులతో పలాస రైల్వే గ్రౌండ్స్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష సభ నిర్వహించారు. ఈ సందర్భంగానే ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వమని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో సభలు పెట్టి రైతుల నుంచి ఆమోదం పొందిన తర్వాతే విమానాశ్రయం పనులను ప్రారంభిస్తామని ఆయన వివరించారు.
Palasa Airport | ఆదివారం నిర్వహించిన సభలో ముందుగా ఆ ప్రాంత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో బిడిమి, మెట్టూరు, చీపురుపల్లి, భేతాళపురం, లక్ష్మీపురం తదితర గ్రామాల ప్రజలు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌కు అంతా ఏకగ్రీవంగా సమ్మతి ప్రకించారు. తమ భూములకు అందించే ధర, స్థానికంగా ఉపాధి, వంద శాతం భూమిని కోల్పోయే వారికి అందించాల్సిన అదనపు సహకారం వంటి విషయాలో లేవనెత్తారు. అంతేకాకుండా ఏ గ్రామంలో ఎంతమేర భూమి అవసరం ఉందో కూడా స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. ప్రజలు, రైతుల డిమాండ్లను నమోదు చేసుకున్న రామ్మోహన్ నాయుడు వాటిని పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

