కలం, వెబ్ డెస్క్ : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టీ20 (IND vs SA Third T20) లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. దర్మశాల (Dharamshala) వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ టీమ్ 117 రన్ లకే ఆలౌట్ అయింది. 20 ఓవర్లు ఆడిన జట్టు బ్యాటర్లలో కేవలం మార్క్రమ్ మాత్రమే 61 పరుగులు చేసి రాణించాడు. డొనవన్ ఫెరీరా (20), అన్రిచ్ నోకియా (12) రన్స్ చేయగా మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్ (India) బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టి పర్యటక టీమ్ ను తక్కువ రన్లకే పరిమితం చేశారు.
Read Also: పాక్‌ను ఉతికారేసిన యువ భారత్..
Follow Us On: Sharechat


