కలం, వెబ్డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో ఐక్యత లేదని, అందరూ కలసి ఉంటే భరోసాగా ఉంటుందని సంగీత దర్శకుడు తమన్ (Thaman) అన్నారు. అఖండ–2 సినిమా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడారు. ‘ఈ సినిమా వారం ఆలస్యంగా రిలీజైంది. వాళ్లు అనుకుని ఉంటే ముందే కేసు వేయొచ్చు. ఆపవచ్చు. కానీ, చివరి నిమిషంలో ఆపారు. దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు. మనలో ఐక్యత లేకుండా పోతోంది. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో పేరుంది. ఇంత మంది హీరోలు, ఈ స్థాయి అభిమానులు ప్రపంచంలో ఎక్కడా లేరు. మన తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలింది.
యూట్యూబ్, సోషల్ మీడియా ఓపెన్ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. చాలా నెగెటివిటీ పెరిగిపోయింది. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్–ఎయిడ్ వేయండి, బ్యాండ్ వేయకండి. సినిమా వాయిదా పడడం వల్ల ఎంతమంది నిర్మాతలు కుమిలిపోయి ఉంటారు? వాళ్లకూ కుటుంబం, పిల్లలు ఉంటారు కదా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ–2(Akhanda 2) సినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని ధైర్యంగా ఉన్నట్లు చెప్పారు. ‘మేము దేవుడిని నమ్ముకొని ఉన్నాం, అందుకే వారం ఆలస్యమైనా హిట్ కొట్టామ’ని తమన్(Thaman) అన్నారు.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On: Pinterest


