epaper
Friday, January 16, 2026
spot_img
epaper

పంచాయతీ ఫలితాలు​.. ఎమ్మెల్యేలకు సొంత గ్రామాల్లోనే షాక్​

కలం,వెబ్​ డెస్క్​ : తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల కోసం క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు అవకాశం కల్పించారు. 2 గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి విజేతలను ప్రకటించారు. అయితే, కొందరు ఎమ్మెల్యేల (MLA)కు సొంత గ్రామంలోనే ఓటర్లు షాక్​ ఇచ్చారు. ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థులు కాకుండా ఇతర పార్టీల వారిని గెలిపించడం చర్చనీయాంశంగా మారింది.

పంచాతయతీ ఎన్నికల్లో (Panchayat Elections)  పాలమూరు జిల్లా దేవరకద్ర(Devarakadra) ఎమ్మెల్యే జి. మధుసూదన్​ రెడ్డి సొంత గ్రామం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్​ బీఆర్​ఎస్ పార్టీ మద్ధతు ఇచ్చిన అభ్యర్థి గెలుపొందారు. ​కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థి భారతీ బాలకృష్ణా రెడ్డి పై బీఆర్​ఎస్​ నుంచి బరిలోకి దిగిన పావని కృష్ణయ్య విజయం సాధించారు. మొత్తం 10 వార్డు స్థానాల్లో ఆరింటిలో బీఆర్​ఎస్ గెలుపొందగా, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సిరెడ్డి సొంత గ్రామాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు ఓడిపోయారు. యశస్విని రెడ్డి సొంత గ్రామం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్​ సర్పంచ్​ అభ్యర్థి కిరణ్​ పై కాంగ్రెస్​ రెబెల్​ అభ్యర్థి మహేందర్​ గెలుపొందారు. కాగా, ఓవరాల్​ గా రెండో విడతలో కాంగ్రెస్​ ముందంజలో కొనసాగుతోంది.

 Read Also:  పాక్‌ను ఉతికారేసిన యువ భారత్..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>