epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రష్మికతో రిలేషన్ నిజమే.. కుండబద్దలు కొట్టిన విజయ్

నేషనల్ క్రష్ రష్మిక మందాన, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరిలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్తలివి. అయితే తాజాగా రష్మికతో తన రిలేషన్‌పై విజయ్ దేవరకొండ ఓపెన్ అయ్యాడు. ఆదివారం విజయ్.. పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ, పెళ్ళిపై హాట్ కామెంట్స్ చేశాడు. రష్మికతో రిలేషన్‌లో ఉన్నానని కుండబద్దలు కొట్టాడు. ఈ సందర్భంగానే ప్రేమపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అన్‌కండిషనల్ లవ్‌ను తాను నమ్మనని చెప్పాడు.

‘‘కండిషన్స్ లేని ప్రేమను నమ్మను. ప్రేమలో ఎప్పుడూ అంచనాలు ఉంటాయి. షరతులు లేని ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. పెళ్ళి తర్వాత మహిళలకు కొంచెం కష్టం అవ్వొచ్చు. కానీ నాకు ఎలాంటి ఇబ్బందిలేదు. మనం చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. పెళ్ళితో నా కెరీర్‌కు ఎటువంటి ఆటంకం రాదు’’ అని విజయ్ చెప్పాడు. ఇప్పుడే నిజంగా జీవించడం ఏంటో నేర్చుకున్నానని చెప్పాడు. తన పేరెంట్స్, ఫ్రెండ్స్, రష్మికతో సమయం ఎక్కువ గడపడానికి కేటాయిస్తానని చెప్పాడు. ఇంతకాలం బిజీ లైఫ్‌లో వాళ్లని నిర్లక్ష్యం చేశానని, ఇకపై అలా ఉండదని వివరించాడు. ప్రస్తుతం విజయ్(Vijay Deverakonda) కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Read Also: నన్ను అంతా లేడీ ప్రభాస్ అంటారు: శ్రీనిధి శెట్టి
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>