కలం, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలో కాల్పులు (Australia Shooting) కలకలం రేపాయి. సిడ్నీ ఈస్టర్న్ సబర్భ్స్లోని బాండీ బీచ్ (Bondy Beach) లోని పర్యాటకలపై ఒక్కసారిగా ఫైరింగ్ చేశారు. ఈ దుర్ఘటనలో 10 మందికి పైగా పర్యాటకులు మరణించారు. ముసుగు ధరించిన టెర్రరిస్టులు బీచ్ లో ఉన్న వారిపై విరుచుకుపడుతూ విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బీచ్ పరిసరాల్లో ఎవరూ ఉండకూడదని హెచ్చరిస్తూ ఆంక్షలు విధించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకరు మరణించగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బీచ్ వద్ద పోలీసులు పెద్ద మోహరించారు. అంబులెన్స్ లు కూడా ఏర్పాటు చేశారు.
Read Also: సూర్యకుమార్ యాదవ్‌పై ఆకాష్ చోప్రా ఘాటు వ్యాక్యలు
Follow Us On: X(Twitter)


