టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్(Rohit Sharma)ను పక్కనబెట్టి శుభ్‌మన్ గిల్(Shubman Gill)ను ఎంపిక చేయడం తీవ్ర చర్చలకు దారితీసింది. 38ఏళ్ల రోహిత్‌ను ఎలా పక్కనబెడతారని సెలక్టర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ను అవమానించింది కాక.. టమిండియా క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ శకం మొదలైందని ప్రకటించడం ఎంత వరకు సమంజసం అంటూ సోషల్ మీడియాలో అభిమానులు బీసీసీఐపై ఒకమోస్తరు యుద్ధాన్ని ప్రకటించారు. ఈ అంశం ఇంత చర్చనీయాంశం కావడంతో కెప్టెన్సీ సెలక్షన్‌పై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) స్పందించాడు.
శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి బలమైన కారణం ఉందని చెప్పాడు. ‘‘ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండేవారు. కానీ అది ఆచరణకు అసాధ్యం. ఇప్పుడు శుభ్‌మన్ గిల్.. టెస్ట్‌లు, వన్డేలకు కెప్టెన్‌గా ఉంటాడు. రాబోయే 2027 ప్రపంచకప్‌పై ఫోకస్ పెట్టాలన్న దీర్ఘకాలిక ఆలోచనతోనే జట్టు పగ్గాలను శుభ్‌మన్‌కు ఇవ్వడం జరిగింది. వన్డే ఫార్మాట్‌కు మ్యాచ్‌లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యూహాలు రెడీ చేసుకోవడానికి కెప్టెన్‌కు ఎక్కువ టైం ఉండదు. అదే రెండు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే.. సరైన వ్యూహాలను సిద్ధం చేయడం సులభం అవుతుంది. అందుకు కావాల్సిన సమయం కూడా లభిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అగార్కర్(Ajit Agarkar) వివరించాడు.

