కలం, వెబ్‌డెస్క్: ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ(Gudivada)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. నెహ్రూ చౌక్ సెంటర్‌లో ఉన్న అద్దేపల్లి కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఓ సెల్ ఫోన్ దుకాణంలో మొదట మంటలు మొదట మంటలు వ్యాపించినట్టు సమాచారం. ఆ తర్వాత క్రమంగా విస్తరించాయి. పక్కన ఉన్న దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
ఈ కాంప్లెక్స్‌లో జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
గుడివాడ(Gudivada)లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశంగా మారింది. అయితే, పలు దుకాణాలు పూర్తిగా దగ్ధమై సుమారు రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి ఆంజనేయులు తెలిపారు. ఘటనాస్థలాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(Venigandla Ramu) సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Read Also: నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా
Follow Us On: Instagram


