కలం, వెబ్ డెస్క్: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా ఫ్రీ వైఫై (Free WiFi) వాడకం పెరిగింది. దీంతో చాలామంది కాఫీ షాపులు, హోటళ్ళు, బస్సులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టూరిజం ప్రదేశాల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారు. ల్యాప్‌ట్యాప్, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో వైఫై వాడకం మరీ ఎక్కువైంది. వైఫైతో లాభాలెన్ని ఉన్నాయో.. నష్టాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఫ్రీ వైఫైకి కనెక్ట్ అయినప్పుడు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ లావాదేవీలను, పర్సనల్ డేటాను హ్యాక్ చేసి వివరాలు చోరీ చేస్తున్నారు.
పోలీసు అధికారుల ప్రకారం… సురక్షితంగా లేని నెట్వర్క్ ఉపయోగించినప్పుడు పాస్వర్డ్, భద్రతా ఫీచర్ లేకుండా కనెక్ట్ అవుతాయి. దీంతో సైబర్ నేరాలు డేటాను కొల్లగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో బ్యాంక్ లావాదేవీలను కొనసాగించినప్పుడు ఫ్రీ వైఫై వాడొద్దు. ఒకవేళ వాడాల్సివస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ను బహిరంగ ప్రదేశంలో ఎక్కువసేపు గమనించకుండా వైఫై కనెక్ట్ చేసి ఉండటం కూడా ప్రమాదం. ప్రయాణాల్లో గ్యాడ్జెట్లలో ఆటోమేటిక్ కనెక్టివిటీని ఆఫ్ చేయాలి. తెలియని ప్రదేశాలకు ప్రయాణించేటప్పుడు వాటిని ఆఫ్‌లో ఉంచండి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో బ్లూటూత్ కనెక్ట్ చేయడం కూడా సైబర్ క్రైమ్స్‌కు దారితీయొచ్చు. అందుకే పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై(Free WiFi) వాడకం తగ్గించాలని చెబుతున్నారు నిపుణులు.
Read Also: చైనా నాటిన చెట్లు.. దేశంలో నీటిని పంపిణీనే మార్చేశాయ్..
Follow Us On: Youtube


