కలం డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఒకే ఫ్లైట్‌లో ఈ రోజు (శనివారం) రాత్రి ఢిల్లీకి వెళ్ళనున్నారు. మెస్సీ (Messi) ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడానికి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాహుల్‌గాంధీ మ్యాచ్ తర్వాత రాత్రి 10.30 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయేలా షెడ్యూలు ఖరారైంది. అదే స్పెషల్ ఫ్లైట్‌లో రాహుల్‌గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళేందుకు ఏర్పాట్లు జరుగతున్నాయి. ‘ఓట్ చోరీ’ (Vote Chori) అంశంపై ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగే నిరసన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. సీఎంఓ కార్యాలయం తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం ఆదివారం ఉదయం ఫ్లైట్‌లో సీఎం ఢిల్లీ వెళ్ళాల్సి ఉన్నది. కానీ ఎలాగూ రాహుల్‌గాంధీ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్తున్నందున ఆయనతో కలిసి శనివారం రాత్రే వెళ్ళనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.
ఇద్దరి మధ్యా బలమైన బంధం :
రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మధ్య సంబంధాలు ఆశాజనకంగా ఏమీ లేవని ఊహాగానాలు వస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండడం గమనార్హం. శంషాబాద్ విమానాశ్రయానికి స్పెషల్ ఫ్లైట్‌లో చేరుకున్న రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, పీసీసీ చీఫ్ స్వాగతం పలికారు. తిరుగు ప్రయాణంలోనూ స్పెషల్ ఫ్లైట్‌లో రాహుల్‌గాంధీ వెళ్తారని పార్టీ వర్గాలు చెప్తున్నా షెడ్యూలులో మాత్రం ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో వెళ్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ చివరకు స్పెషల్ ఫ్లైట్‌లోనే ఇద్దరూ వెళ్తారంటూ సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోని తెలంగాణ అధికారులకు సైతం ఇదే సమాచారాన్ని పంపినట్లు తెలిసింది. ఓట్ చోరీ నిరసన(Vote Chori Protest) సభ అనంతరం తిరిగి సీఎం రేవంత్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.
ఇతర రాష్ట్రాల నుంచీ ఢిల్లీకి :
రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఓట్ చోరీ నిరసన కార్యక్రమానికి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం సైతం హాజరవుతున్నారు. ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా నిరసనలో పాల్గొంటున్నారు. సోనియాగాంధీ కూడా వస్తారని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నా కాలుష్యం, వాతావరణ పరిస్థితుల రీత్యా అనుమానాన్ని సైతం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి కూడా పలువురు పార్టీ నేతలు వెళ్తున్నారు. ఒకే ఫ్లైట్‌లో వెళ్తున్న రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి నడుమ ఎలాంటి సంభాషణ జరుగుతుంది.. ఏయే అంశాలు చర్చకు వస్తాయి… ఇలాంటివి పొలిటికల్ చర్చగా మారాయి.
Read Also: సర్పంచ్ ఫలితాలు.. పార్టీలు ఏం నేర్చుకోవాలి..?
Follow Us On: Sharechat


