కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల నిర్వహణ తీరు అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో రెండేండ్లలో 116 మంది విద్యార్థులు చనిపోయారని (Gurukul Student Deaths) ఆయన పేర్కొన్నారు. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు.
అనంతరం హరీశ్ రావు (Harish Rao) మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట ‘పాయిజన్ 2047’గా మారారని విమర్శించారు. రెండేళ్ల పాలనలో స్కూలు విద్యార్థులకు కనీసం పట్టెడన్నం పెట్టలేక పోయారంటూ మండిపడ్డారు. ‘ఇంత మంది విద్యార్థులు చనిపోయినా రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి చీమ కుట్టినట్లు కూడా అవ్వడం లేదు.’ అంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్న చంద్రు నాయక్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో 44 మంది విద్యార్ధులకు, బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.’ ఈ ఘటన ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
Read Also: మెస్సీని కలవడానికి నో చెప్పిన సునీల్ ఛెత్రి.. ఎందుకంటే..!
Follow Us On: Sharechat


