కలం, వెబ్ డెస్క్ : Messi Match | కోల్ కత్తా లో సాల్ట్ లేక్ స్టేడియంలో ఎంత రచ్చ జరిగిందో చూశాం. లియోనెల్ మెస్సీ మ్యాచ్ లో ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల గందరగోళం నెలకొంది. చివరకు మ్యాచ్ క్యాన్సిల్ చేశారు పోలీసులు. ఆగ్రహంతో ఫ్యాన్స్ స్టేడియంలోకి బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. స్టేడియంలోని వస్తువలన్నీ ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2500 మంది పోలీసులతో (Hyderabad Police) భద్రత కల్పించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను పెంచబోతున్నారు. మరిన్ని ఆంక్షలు కూడా విధించే ఛాన్స్ కనిపిస్తోంది. కోల్ కత్తా(Kolkata)లో జరిగిన పొరపాట్లు ఉప్పల్ లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం టికెట్లు ఉన్న వారికే స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నారు.
Follow Us On: X(Twitter)


