కలం, వెబ్ డెస్క్: కోల్‌కతాలోని మెస్సీ (Messi) మ్యాచ్ లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. ఫ్లెక్సీలు చించేసి రచ్చ రచ్చ చేశారు. అయితే మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారా? లేదంటే ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకురావడంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. మొత్తంగా మెస్సీ కోల్ కతా మ్యాచ్ తీవ్ర గందరగోళం మధ్య అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు వస్తే సరైన భద్రత కల్పించడంలో కోల్ కతా ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Central Govt) మెస్సీకి జడ్ ప్లస్ సెక్యూరుటీ కల్పించినప్పటికీ .. స్టేడియంలో భద్రత కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి.
ఇదో చెత్త ఈవెంట్ : అభిమాని ఆగ్రహం
కోల్‌కతా(Kolkata)లో జరిగిన మ్యాచ్ పై ఓ అభిమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కనీసం పది నిమిషాలు కూడా మ్యాచ్ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. “ఇది అత్యంత చెత్త ఈవెంట్. ఆయన కేవలం 10 నిమిషాల కోసం వచ్చారు. మంత్రులు, స్థానిక నేతలు ఆయన చుట్టూ తిరిగారు. మేం మ్యాచ్ చూసే అవకాశమే దక్కలేదు. మా సమయం, డబ్బు అంతా వృథా అయ్యింది. నిర్వహణ తీరు అత్యంత దారుణం’ అంటూ ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read Also: మెస్సీ టూర్ .. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Follow Us On: Instagram


