కలం, వెబ్ డెస్క్: ఐబొమ్మ రవి (iBomma Ravi) కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. రవిని ఎక్కువ రోజులు కస్టడీకి కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో ఇరు పక్షాల లాయర్లు వాదనలు వినిపించారు. కస్టడీ పేరుతో రవిని ఇబ్బంది పెడుతున్నారని న్యాయమూర్తికి రవి తరపు న్యాయవాది శ్రీనాథ్ చెప్పారు. కస్టడీకి తీసుకుంటేనే రవి నెట్‌వర్క్ బయటపడుతుందని సైబర్ క్రైమ్ పోలీసుల అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ నెల 16కు తీర్పు రిజర్వ్ చేశారు.
కొత్తగా విడుదలైన సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్‌ను పైరసీ చేసి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖులు ప్రెస్‌మీట్లు పెట్టి సినిమాలను పైరసీ చేయొద్దని మండిపడ్డారు. రవి(iBomma Ravi) లాంటి వారిని శిక్షించాలని కఠినంగా డిమాండ్ చేయగా, సామాన్య ప్రజలు మాత్రం ఐబొమ్మ రవికి బహిరంగంగా మద్దతు తెల్పడం కొసమెరుపు.
Read Also: ఫామ్‌హౌస్ పార్టీపై దువ్వాడ క్లారిటీ
Follow Us On: Pinterest


