epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ట్రంప్ గోల్డ్ కార్డ్.. ఆ కంపెనీల చేతుల్లో భారత పౌరుల భవిష్యత్..?

కలం డెస్క్: ట్రంప్ గోల్డ్ కార్డ్ (Trump Gold Card) ఒచ్చేసింది. అమెరికా పౌరసత్వం కావాలంటే రూ.9 కోట్ల గోల్డ్ కార్డ్ కొనాల్సిందే. ఒకవేళ కంపెనీలో జాబ్ చేస్తే రూ.18 కోట్లు కట్టాలి. అమెరికాలో జాబ్ చేసే వాళ్లలో 75 పర్సెంట్ ఇండియన్సే. గ్రీన్ కార్డు మీద వాళ్లు పెట్టుకున్న ఆశలపై ట్రంప్ నీళ్లు కుమ్మరించాడు. గ్రీన్ కార్డు కావాలి అనుకునే వారికి ఇది ఒక రకంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికాలో గ్రీన్ కార్డు పొందిన వారిలో ఇండియా, చైనా, యూరప్ దేశాల వాళ్లే ఎక్కువ. ఇన్ని రోజులు హెచ్ 1బీ వీసాలు పొందిన తర్వాత అమెరికాలో పౌరసత్వం కోసం ఈబీ-5 వీసా పొందేవాళ్లు. ఇదే గ్రీన్ కార్డు.

అందులో అక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్న ట్రంప్.. దానికి చాలా ఏళ్ల టైమ్ పడుతోందని.. కాబట్టి గోల్డ్ కార్డ్ (Trump Gold Card) వీసా తీసుకొస్తున్నట్టు తెలిపాడు. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను అమెరికాకు తీసుకెళ్లడం. అమెరికాలో వారితో పెట్టుబడులు పెట్టించడం. కానీ ఇదే టైమ్ లో అమెరికాలో జాబ్ చేస్తున్న ఇండియన్స్ పరిస్థితి అయోమయంలో పడింది. ఇన్ని రోజులు హెచ్-1బీ తర్వాత మన వాళ్లు గ్రీన్ కార్డు పొందేవాళ్లు. కానీ గ్రీన్ కార్డు అని చెబుతున్న గోల్డెన్ కార్డు ఫీజు రూ.9 కోట్లు అంటే ఎలా చెల్లిస్తారు. ఒకవేళ ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తే రూ.18 కోట్లు సదరు కంపెనీలు కట్టాలంటున్నారు. అమెరికాలో పనిచేస్తున్న మన వాళ్లు రూ.9 కోట్లు కట్టలేమని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వారి ఆశలన్నీ వాళ్లు పనిచేస్తున్న కంపెనీల మీదే ఆధారపడింది. ఆ కంపెనీలు రూ.18 కోట్లు కడుతాయా అంటే డౌటే.

అమెరికా టెక్ దిగ్గజాలు యాపిల్, అమేజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో హై పొజీషన్ లో పనిచేసే ఇండియన్స్ కు ఏడాది జీతాలు కోట్లలోనే ఉన్నాయి. అలాంటి వారందరికీ ఇప్పటికే గ్రీన్ కార్డులు కూడా వచ్చాయి. కానీ మిగతా వాళ్లకు ఆ స్థాయిలో జీతాలు లేవు. వాళ్లంతా హెచ్ 1బీ వీసాల మీదనే ఉంటున్నారు. ఇప్పటికే దీని ఫీజు ఏడాదికి లక్ష డాలర్లు చేశాడు ట్రంప్. దీన్ని కట్టడానికే నానా తంటాలు పడుతున్నారు. ఇంకొంచెం కష్టపడి గ్రీన్ కార్డు తీసుకుందామని అనుకుంటే.. ఇప్పుడు రూ.9 కోట్లు చేశాడు ట్రంప్. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని.. కంపెనీలు కట్టకపోతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఒకవేళ కంపెనీలు ఆ మొత్తం కట్టకపోతే అమెరికా పౌరసత్వం వాళ్లకు కలగానే మిగులుతుంది. ఇటు హెచ్ 1బీ వీసాలపై ఆంక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏ టైమ్ లో బయటకు పంపించేస్తారో అనే టెన్షన్ తోనే బతుకుతున్నాం అంటున్నారు. ఈ టైమ్ లో అమెరికాలో ఆల్రెడీ జాబులు చేస్తున్న వారికి, కొత్తగా జాబుల్లో చేరాలనుకునే వారికి పెద్ద గుదిబండగా మారాయి ట్రంప్ నిర్ణయాలు.

Read Also: ఆరు దేశాల్లో ధురంధర్ మూవీ బ్యాన్.. కారణమేంటి?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>