epaper
Friday, January 16, 2026
spot_img
epaper

డీకే విందులో బీజేపీ ఎమ్మెల్యేలు!

కలం, వెబ్​డెస్క్​: కర్ణాటకలో కొన్నాళ్లుగా జరుగుతున్న విందు రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. గురువారం రాత్రి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar)​ పాల్గొన్న విందుకు బీజేపీ బహిష్క్కత ఎమ్మెల్యేలు హాజరవడం సరికొత్త చర్చకు దారితీసింది. అధిష్టానం అంగీకరించకపోతే తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి డీకే సీఎం పీఠం అధిరోహిస్తారని, దానికి బీజేపీ మద్దతు ఇస్తుందనే ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విందులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఎస్​టీ సోమశేఖర్​, శివరామ్​ హెబ్బార్​ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, బెళగావిలో కాంగ్రెస్​ నేత ప్రవీణ్​ ఇంట్లో జరిగిన ఈ డిన్నర్​లో డీకేతోపాటు మంత్రులు కేహెచ్​ మునియప్ప, మంకాల్​ వైద్య, డాక్టర్​ ఎంసీ సుధాకర్​తో పాటు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరైనట్లు సమాచారం.

ఇది సాధారణ విందు మాత్రమేనని, రాజకీయ ప్రాధాన్యం డీకే (DK Shivakumar) చెబుతున్నప్పటికీ.. ఈ డిన్నర్​ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, అధిష్టానాన్ని ఇరుకున పెట్టేదే. మరోవైపు, అంతకుముందు రోజు బెళగావి మాజీ ఎమ్మెల్యే ఫిజోర్​ ఇంట్లో జరిగిన ఓ విందులో తన మద్దతుదారులు, సన్నిహితులతో కలసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనడం గమనార్హం. ఇప్పటివరకు సిద్ధరామయ్య, డీకే మధ్య స్వగృహాల్లో బ్రేక్​ఫాస్ట్​ చర్చలు జరపగా, ఇప్పుడు మద్దతుదారులతో వేర్వేరుగా విందుల్లో పాల్గొనడం కర్ణాటక రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.

Read Also: Tన్యూస్, ఇద్దరు ఎమ్మెల్యేలకు కవిత లీగల్ నోటీస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>