కలం, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడడంతో 10 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌లో (Maredumilli Ghat Road) ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన సుమారు 35 మంది ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో విహారయాత్రకు వెళ్లారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వీరంతా సింహాచలం, అన్నవరం దర్శించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం బయలుదేరారు.
చింతూరు–మారేడుమిల్లి (Chinturu – Maredumilli) ఘాట్ రోడ్డు మీదుగా వెళుతుండగా, బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. దీంతో 9 మంది అక్కడికక్కడే చనిపోగా, మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలిసి పోలీసులు, వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగా డ్రైవర్‌కు దారి కనపడకపోవడంతో మలుపు వద్ద ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రధాని మోదీ సంతాపం..:
ఏపీ రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించినవారి కుటుంబాలకు రూ.2లక్షలకు, గాయపడినవాళ్లకు రూ.50వేలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోలీసులు, స్థానిక అధికారుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
Read Also: ఫోన్ టాపింగ్ కేసు: లొంగిపోయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
Follow Us On: Youtube


