కలం, వరంగల్ బ్యూరో: చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి కి ఓట్లు వేసి అభిమానం చాటుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలం నడికుడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో (Panchayat Elections) పోటీ కి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండె పోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయింంచారు. ఈ రోజు జరిగిన పోలింగ్ లో ఆయనకు 165 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


