epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మొక్కజొన్న రైతులకు రూ. 588 కోట్లు

కలం డెస్క్ : రాష్ట్రంలో మొక్కజొన్న పండించిన రైతులకు (Corn Farmers) ప్రభుత్వం రేపు (శుక్రవారం) రూ. 588 కోట్లను వారివారి ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.45 లక్షల టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. సేకరణ ప్రక్రియ పూర్తికావడంతో రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించనున్నది. దీని ద్వారా సుమారు 55,900 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసినందున ఈ డబ్బును ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ఆదేశాలు జారీచేశారు. జిల్లాల వ్యవసాయ అధికారులు వారి దగ్గరున్న జాబితా ప్రకారం శుక్రవారం నుంచే డిపాజిట్ చేసే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.

Read Also: త్వరలో వర్శిటీల టీచింగ్ పోస్టుల భర్తీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>