కలం, వెబ్‌డెస్క్: భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన ఎఫ్–16 యుద్ధ విమానాల ఆధునికీకకరణ (PAK F16 Upgrade) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పాక్‌కు 686 మిలియన్ డాలర్లు(రూ.5,700కోట్లు) అందించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీన్ని ఆమోదం కోసం కాంగ్రెస్ కమిటీలకు పంపింది. దీన్ని కాంగ్రెస్ సభ్యులు నెల లోపు సమీక్ష చేసి అభిప్రాయం చెప్పనున్నారు. అయితే, ఇటీవల పాక్‌కు సంబంధించిన విషయాల్లో ట్రంప్‌కు కాంగ్రెస్ నుంచి పెద్ద వ్యతిరేకత ఏమీ లేకపోవడంతో ప్రస్తుత ప్రతిపాదన సైతం ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. భారత్‌కు ఆందోళనకరంగా మారిన ఈ నిర్ణయంపై ఇండియా నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రతిపాదనలో ఏముందంటే..
పాక్‌కు అవసరమైన రక్షణ సాయం (PAK F16 Upgrade) అందించేందుకు ఈ ప్రతిపాదన సిద్ధం చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ(డీఎస్‌సీఏ) కాంగ్రెస్‌కు పంపిన లేఖలో పేర్కొంది. ఈ ఒప్పందం కింద పాకిస్థాన్‌కు చెందిన బ్లాక్–52, ఎఫ్–16 యుద్ధ విమానాలను ఆధునికీకరించనున్నారు. దీనికోసం 37 మిలియన్ డాలర్ల విలువైన ప్రధాన రక్షణ పరికరాలు(ఎండీఈ), 649 మిలియన్ డాలర్ల విలువైన అదనపు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక సహకారం అందిస్తారు. అలాగే ఈ ప్యాకేజీలో 92 లింక్–16 టాక్టికల్ డేలా లింక్ సిస్టమ్స్, శిక్షణ కోసం ఉపయోగించే ఆరు ఎంకే –82 బాంబులు, ఏవియానిక్స్ అప్డేట్స్, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్పేర్ పార్టులు, శిక్షణ వంటివి ఉన్నాయి.
అమెరికా ఏమంటోంది..
పాక్‌కు రక్షణ సాయం అందించే ఈ ఒప్పందంపై అమెరికా ఏమంటోందంటే.. ఉగ్రవాదంపై పోరులో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. మిత్రపక్షాల దళాలతో కలసి మరింత సమర్థంగా పనిచేసేందుకు, తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ఈ ఆధునికీకరణకు అంగీకరించినట్లు అంటోంది. దీని వల్ల ఎఫ్–16 యుద్ధ విమానాల జీవిత కాలం మరో 15 ఏళ్లు.. అంటే 2040 వరకు పెరుగుతుందని, అలాగే భద్రతాపరమైన సమస్యలు తొలగిపోతాయని చెప్తోంది. దీనివల్ల ప్రాంతీయ సైనిక సమతుల్యతలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రతిపాదన పత్రంలో పేర్కొంది. పాకిస్థాన్‌కు రక్షణ సాయంపై భారత్ నుంచి వచ్చే ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని చేర్చినట్లు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు అమెరికాలోని ప్రసిద్ధ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ ప్రధాన కాంట్రాక్టర్.
Read Also: భారత్‌పై 50శాతం టారిఫ్స్: మెక్సికో
Follow Us On: Youtube


